కష్టాల్లో ఉన్న దర్శకుడిని ఆదుకున్న హీరో టైగర్ ష్రాఫ్...!

VAMSI
బాలీవుడ్ పరిశ్రమ గురించి చాలా విషయాలు అందరికీ తెలియవు. ఎందుకంటే అక్కడ కేవలం ఎవరైనా రాణించాలంటే వారికీ గొప్ప సినిమా నేపధ్యం ఉండాలి. లేకుంటే వారిని బాగుపడకుండా చేయడానికి ఎంతోమంది కాచుకుని ఉంటారు. ఇది లోపల జరుగుతున్నా ఎప్పుడూ పబ్లిక్ కాలేదు. కానీ జూన్ లో జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా అంతకుమించి పాపులర్ అయిన మరో విషయం ఏమిటంటే మీ టూ ఉద్యమం. దీనివలన కొంతమంది భవిష్యత్తు ప్రస్నార్ధముకంగా మారింది. అదే కోవలోకి వస్తుంది బాలీవుడ్ దర్శకుడు వికాస్ బల్ కెరీర్.
వికాస్ బల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమా విడుదల సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అందువలన చిత్ర బృందం ఈయనను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా దర్శకుడు వికాస్ బల్ అనే అనుకున్నారు. అయితే దీని ప్రభావం ఈయనపై భారీగా పడింది. ఎవరూ ఈయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. దీనితో ఒకానొక దశలో తీర్వ ఇబ్బందులను ఎదుర్కున్నాడు.  
కానీ ఒక యువ కథానాయకుడు వీటన్నింటినీ పెడచెవిన పెట్టి ఈయనకు సినిమా అవకాశం ఇచ్చాడు. అతనెవరో కాదు ప్రముఖ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్. ఇప్పుడు టైగర్ హీరోగా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ తో మనముందుకు రాబోతున్నాడు. దీనికి గణ్ పత్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు.  ఇందులో టైగర్ కు జోడీగా ప్రముఖ హీరోయిన్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా భాగీ లాంటి సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలియచేసారు. సినిమా ఇండస్ట్రీలో అందరూ దూరం పెట్టినా కూడా, టైగర్ ష్రాఫ్ మంచి మనసుతో వికాస్ బల్ కు అవకాశం ఇవ్వడం చాలా ఆనందించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: