పవన్ కల్యాణ్ ని అవమానించిన రానా..

Deekshitha Reddy
పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశం అంటే చాలామంది ఇతర హీరోలు ఆసక్తిగానే ఉంటారు. ఆయనతో మల్టీస్టారర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ రానా మాత్రం పవన్ కల్యాణ్ సినిమా ఆఫర్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. తనకు ఆ సినిమాలో నటించడం ఆసక్తిగానే ఉందని చెప్పినా కూడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించలేదట. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానులు రానాపై మండిపడుతున్నారు.
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో రానా.. తన కొత్త సినిమా అరణ్య ప్రమోషన్ పనులు చూస్తున్నారు. అటు విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, నందితా దాస్‌, ప్రియమణి ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రానా, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోందనే వార్తలు బైటకు వచ్చాయి. మళయాల హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ లో పవన్ కల్యాణ్, రానా ఇద్దరూ కలసి నటిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే చిన్న టీజర్ బైటకు వదిలింది చిత్ర టీమ్. అయితే ఇందులో కేవలం పవన్ కల్యాణ్ ప్రస్తావన మాత్రమే ఉంది. అప్పటి వరకు పవన్ ఒక్కరే ఈ సినమాలో నటిస్తారని ప్రచారం జరిగింది. రానా విషయంపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ పై స్పందించారు. ఈ సినిమాకోసం తనను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు తెలిపారు రానా. ‘అవును ఈ సినిమాలోని పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉంది’ అని చెప్పారు రానా. అయితే రానా మాటల్లో ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం గమనార్హం. ఇదే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించింది. పవన్ కల్యాణ్ సినిమాలో నటిండచం, నటించకపోవడం వేరే విషయం. కనీసం, పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా అని కూడా రానా చెప్పలేదని ఫీలవుతున్నారట పవర్ స్టార్ అభిమానులు. సోషల్ మీడియాలో రానాను తెగ ట్రోల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: