పవర్ స్టార్ సినిమాలో కొణిదెల అల్లుడు కాదు... అక్కినేని అల్లుడు...!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీ అయిపోయాడు. వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. పవర్ స్టార్ తన కెరియర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేశాడు. ఇప్పుడు మరో రీమేక్ లో హీరోగా నటించి ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో కథ ప్రకారం ఇద్దరు హీరోలు ఉండాలి. మొదట్లో రానా ఓ హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అయితే నిర్మాతలు పవన్ కళ్యాణ్ హీరో అని అనౌన్స్ చేసారు కానీ… రానా పేరు ప్రస్తావించలేదు. దాంతో రానా ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడు అంటూ ప్రచారం మొదలైంది.

అతని స్థానంలో నితిన్, సాయి తేజ్ వంటి హీరోలను సంప్రదిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరో హీరో పేరు కూడా చేరింది. వివరాల్లోకి వెళితే…’అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో సుమంత్ ఓ హీరోగా నటించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం అతని కొత్త లుక్ అని తెలుస్తుంది.మునుపెన్నడూ లేని విధంగా సుమంత్..ఎక్కువ గడ్డం మరియు తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు . అడ్డ బొట్టు మరియు చేతికి కడియాలు..

నల్ల చొక్కా, ఎర్ర లుంగీతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో పవన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసాడు అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమే అయితే ఇతని కెరీర్ కు ప్లస్ అవుతుంది. కానీ ఆ పాత్రకు ఫామ్లో లేని హీరోని తీసుకుంటారా అనేది పెద్ద ప్రశ్న..? కాబట్టి ఇవి వట్టి పుకార్లే అయ్యుండొచ్చు అనేది కొందరి అభిప్రాయం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: