అందరి చూపూ ఇపుడు ఓటీటీలపైనే..?
దసరాకు ఎలాంటి సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు. కాకపోతే.. మరి ఆ రోజుల్లోనే షూట్ పూర్తి చేసుకొని రిలీజ్ కావల్సిన నర్తనశాల దసరా కానుకగా 17నిమిషాల నిడివితో నెటిజన్ల ముందుకు వచ్చింది. ఏటీటీలో రిలీజ్ అవుతోన్న ఈ ఫిలింలో సౌందర్య, శ్రీహరి లాంటి నింగికెగిసిన తారలు ఉండడంతో నెటిజన్లకు ఈ సినిమా చూడాలనే తాపత్రయం బాగా పెరిగిపోయింది. టాప్ హీరో తర్వాత సౌందర్యతో బాలయ్యబాబు చేసిన సినిమా ఇదే.
తాజాగా సుహాస్, చాందినీ చౌదరి కాంబోలో రూపొందిన "కలర్ ఫొటో" ఫిలిం కూడా థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితులు లేక ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ ఆహాలో దసరా కానుకగా విడుదలైంది..ఇందులో సునీల్ విలన్ పాత్ర పోషించడంతో సినిమాకు కాస్త హైప్ వచ్చింది. థియేటర్లో దసరా సినిమా చూడలేని వారు ఆహా ఓటీటీ యాప్ లో కలర్ ఫొటో సినిమా చూసి దసరాకు మూవీ చూడలేదనే లోటును తీర్చుకోవచ్చు.
బాలీవుడ్ సినీ ఆడియన్స్ కు దసరా కానుకగా సూపర్ హిట్ సిరీస్ మిర్జాపూర్ కు సీక్వెల్ గా మీర్జాపూర్ 2 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇది అందుబాటులోకి వచ్చింది.అలాగే టబు,ఇషాన్ కట్టర్ కాంబోలో "ఏ స్యూటబుల్ బాయ్"..నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.ఈ రెండు సినిమాలపై మంచి డిమాండ్ ఉంది.కరెక్ట్ టైమ్ చూసి దసరా కానుకగా ఈ రెండు ఫిలింస్ ను ఓటీటీ లలో అందుబాటులోకి తెచ్చారు.దసరాకు డిజిటల్ సొగసులు అద్దారు.