ధియేటర్లకు శత్రువుగా మారనున్న పే పర్ వ్యూ !

Seetha Sailaja
కరోనా పరిస్థితులు తరువాత ప్రజల ఆలోచనలు జీవన సరళి పూర్తిగా మారిపోయింది. క్రితం లా జనం విలాసాలు అనవసరపు ఖర్చులు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో టూరిజమ్ ఫిలిం ఇందాస్త్రీలు ఎప్పటికి కోలుకుంటాయో ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మారింది.

ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా రారా అన్న సందేహాలు కొనసాగుతున్న సమయంలో వైజాగ్ లో ఓపెన్ చేసిన ఒక ఐమాక్స్ ధియేటర్ కు గత రెండు రోజులుగా వస్తున్న అతి తక్కువ కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు బెదిరిపోతున్నాయి. దీనితో సినిమాలు అభిమానించే ప్రేక్షకులకు ‘పే పర్ వ్యూ’ అలవాటు చేయడం తప్పించి మరొక మార్గం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

ఈ లాక్ డౌన్ పరిస్థితులలో ప్రయోగాత్మకంగా ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ పే పర్ వ్యూ పద్ధతిలో ఈమధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసిన ‘ఖాళి పెళ్ళి’ మూవీకి మంచి కలక్షన్స్ రావడంతో ఇక చిన్న మిడిల్ రేంజ్ సినిమాలు అన్నీ రానున్న రోజులలో ఈ పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల కావడమే మార్గమా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇషాన్ ఖత్తర్ అనన్య పాండే లు నటించిన ఈమూవీకి పే పర్ వ్యూ ప్లాట్ ఫామ్ లో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అభిషేక్ పాతక్ అభిప్రాయం ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో చాల సినిమాలు ఈ పే పర్ వ్యూ పద్ధతిలో విడుదలై ప్రేక్షకులు ఈవిదానంలో సినిమాలు చూసే ట్రెండ్ రాబోతోంది అన్న జోస్యం చెపుతున్నాడు.

ఈ అంచనాలు నిజం అయితే ఇక ధియేటర్లు కేవలం పెద్ద హీరోల సినిమాలకే పరిమితం అవుతాయి. ఇలాగే ఈ ట్రెండ్ బలపడితే ధియేటర్లు నడపడం చాల కష్టం అవుతుంది. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటికి మించి రాని పరిస్థితులలో కేవలం పెద్ద హీరోల సినిమాల ప్రదర్శనకు మాత్రమే పనికి వచ్చే సాధనాలుగా ధియేటర్స్ మారిపోతే రానున్న రోజులలో ఇక మల్టీ ప్లెక్స్ ధియేటర్లు తప్ప దేశంలో మరెక్కడా సింగిల్ స్క్రీన్ ధియేటర్లు కనిపించే రోజులు లేక పే పర్ వ్యూ దియేటర్లను చంపే వైరస్ గా మారుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: