బాలు గారు తన తండ్రి కోరికను తీర్చలేకపోయారట..

Purushottham Vinay
బాల సుబ్రహ్మణ్యం గారి మరణం భారతదేశంలోని సంగీత ప్రియుల ప్రేక్షకుల అందరికి తీరని లోటుగా మారింది. ఆయన బ్రతికి వున్నప్పుడు తన తండ్రి కోరికను తీర్చలేకపోయారట. ఆ కోరిక ఏమిటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి.. కుమారుడు కర్ణాటక సంగీత కచ్చేరి చేస్తే వినాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే సాంబమూర్తి వెళ్ళిపోయారు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక సంగీత కచ్చేరి చెయ్యాలని ఎస్పీ బాలు తాపత్రయపడ్డారు. తండ్రి కోరిక మేరకు ఎప్పటికైనా కర్ణాటక సంగీతంలో కచ్చేరీ చెయ్యాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అది తీరకుండానే ఆయన కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎస్పీ బాలు పెర్ఫెక్షనిస్ట్. ప్రతి పనిలో పర్ఫెక్షన్ వుండాలని ఆయన కోరుకుంటారు.
పేరుకు కర్ణాటక సంగీత కచ్చేరి ఇచ్చి మమ అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకని, ఆరు నెలల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుని పోయేలోపు కచ్చేరి ఇవ్వాలని అనుకున్నారు. ,ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఓ అవకాశం కూడా ఇచ్చారు. “నా దగ్గరకు రా. ఆరు నెలల్లో అన్నీ నేర్పుతా’ అని చెప్పార్ట. ఆరు నెలలు ఖాళీ చేసుకుని వెళ్ళడం బాలుకి అప్పట్లో సాధ్యపడలేదు. రోజుకు కనీసం రెండు పాటలు అయినా పాడేవారు. ఇక, ఖాళీ ఎక్కడ వుంటుంది చెప్పండి?
ఒకసారి తిరువయ్యారులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాడటానికి రమ్మని ఎస్పీ బాలుకి ఆహ్వానం వచ్చింది. కర్ణాటక సంగీత కచ్చేరి ఇవ్వమని పిలిచారు. వాళ్ళు ధైర్యం చేశారు కాని బాలు చెయ్యలేకపోయారు. తండ్రి కోరికతో పాటు తన ఆశయం, లక్ష్యం కూడా తీరకుండా బాలు వెళ్ళిపోయారు.
ఇక ఆయన మరణం పై ప్రముఖ నటులు ఇంకా ప్రేక్షక దేవుళ్ళు  సోషల్ మీడియా వేదికగా ఆయన గొప్ప తనాన్ని వర్ణిస్తూ, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: