ఎన్టీఆర్ ని పక్కన పెట్టి ప్రభాస్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్
ఆ మధ్య కొన్ని సంధర్భాలలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ చిత్ర నిర్మాతలుగా ప్రచారం అవుతున్న మైత్రి మూవీ మేకర్స్ సైతం పరోక్షంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై హింట్ ఇచ్చారు.ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీ చేయనున్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది.ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ నెరేట్ చేయడంతో పాటు మూవీ కూడా ఒకే చేయించుకున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఖాయమే అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు ప్రాజెక్ట్స్ రాధే శ్యామ్, ప్రభాస్ 21, ఆదిపురుష్ చిత్రాల అనంతరం ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని ఇండియా హెరాల్డ్ కి తాజాగా సమాచారం వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీ మొదలుపెట్టే లోపు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి చేయనున్నాడా లేక ఎన్టీఆర్ మూవీ పూర్తిగా పక్కన పెడతాడా అనేది తెలియాల్సింది. ప్రభాస్ తో ఆయన మూవీ మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. మరి ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టి, ప్రభాస్ తో సినిమా చేస్తాడా?లేదా?అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్. ఇదిలా ఉంటె ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్2 ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దసరా కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాకనే ప్రశాంత్ తన తర్వాతి ప్రాజెక్టుపై పూర్తి దృష్టి సారిస్తారు.