ఆదాశర్మ కు ‘క్వశ్చన్ మార్క్’‌ బ్రేక్ ఇస్తుందా?

Satvika
నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఆదాశర్మ ..ఆ సినిమా అనుకున్న పేరును తీసుకురాలేదు.. అయిన అమ్మడు అందానికి మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి..దాంతో ఇంక తెలుగు సినిమాలలో తిరుగులేదు.. వరుస సినిమాలలో నటిస్తూ ఓ రేంజులో ఉంటుందని అనుకున్నారు..అక్కడే రివర్స్ అయ్యింది. మెయిన్ హీరోయిన్ కన్న, సెకండ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. రెండు మూడు సినిమాలలో కనిపించింది.ఆ తర్వాత ఇప్పటి వరకు వేరే సినిమాలో కనిపించలేదు. 


ఇప్పుడు మరో సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరింబోతోంది.శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్(?). విప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గౌరీకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ఎవరు చూసిన ఎంట్టైన్మెంట్ అంటూ సినిమాలను తీస్తున్నారు. మెసేజ్ ఇవ్వడం లేదు. ఈ సినిమాలో మెసేజ్ తో పాటుగా ఎంట్టైన్మెంట్ కూడా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందని చిత్రయూనిట్ ను అభినందించారు. 


‘క్వశ్చన్ మార్క్’ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు కరోనా ప్రభావం ఉన్నా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేసాము. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ డైరెక్టర్ విప్రా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ యాప్ట్ అని అంటారని తెలిపారు. కరోనా టైమ్‌ షూటింగ్ జరుపుకుని రిలీజవుతున్న తొలి చిత్రం తమదేనని హీరోయిన్ ఆధాశర్మ అన్నారు. సినిమా స్టోరీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ టైమ్ నా సినిమా కు నేను డబ్బింగ్ చెప్పాను అంటూ ఆదా అంది. కొత్త హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో రచ్చచేసిన ఈ బ్యూటీ కి,ఈ సినిమా ఏ మాత్రం లైఫ్ ను టర్న్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: