ఇండస్ట్రీ మొనగాళ్ళు అనిపించుకుంటున్న అక్కినేని హీరోలు !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మెగా నందమూరి దగ్గుబాటి హీరోల తరువాత అక్కినేని హీరోల హవా ఇప్పటి వరకు కొనసాగింది. సినిమాల కలక్షన్స్ విషయంలో కూడ మెగా నందమూరి హీరోల స్టామినా ముందు అక్కినేని హీరోలు ఇప్పటి వరకు వెనకంజలోనే ఉన్నారు. అయితే కరోనా పరిస్థితుల తరువాత ప్రారంభం అవుతున్న షూటింగ్ ల విషయంలో ఇప్పుడు అక్కినేని హీరోలు ఇండస్ట్రీ మొనగాళ్ళుగా మారండం హాట్ టాపిక్ గా మారింది.


అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్ 4’ షోను మొదలుపెట్టడమే కాకుండా తన పెండింగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ను కూడ మొదలు పెట్టేస్తున్నాడు. ఇక నాగచైతన్య తన లవ్ స్టోరీ మూవీ షూటింగ్ ను ఇప్పటికే సాయి పల్లవితో కలిసి తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లె ప్రాంతంలో తన మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాడు.


ఇప్పటివరకు ఫెయిల్యూర్ హీరోగా ముద్ర వేయించుకున్న అఖిల్ కూడ తన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ షూటింగ్ మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో అఖిల్ పూజా హెగ్డే కాంబినేషన్ లో కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. పూజా హెగ్డే తన వానిటీ వ్యాన్లో నుంచున్న ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ అప్డేట్ ని ధృవీకరించింది. మాస్కులు మరియు పిపిఇ కిట్లతో ఉన్న ఆమె సిబ్బంది తో ఆమె నిల్చుని ఉన్న ఫోటో ఇప్పుడు మీడియాలో హడావిడి చేస్తోంది.


ఇలా ఈ అక్కినేని హీరోలు అంతా తమ సినిమాల షూటింగ్ లు మొదలుపెడితే నందమూరి మెగా దగ్గుబాటి ఘట్టమనేని కుటుంబ హీరోలు మాత్రం ఇంకా తమ ఇళ్లకే అంకితం అవుతూ అక్టోబర్ లేదంటే నవంబర్ నుండి షూటింగ్ లు అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అక్కినేని హీరోలు కరోనా వైరస్ కు భయపడకుండా మొత్తం కుటుంబంలోని ముగ్గురు తమ సినిమాల షూటింగ్ లను కొనసాగిస్తూ ఇండస్ట్రీ మొనగాళ్ళుగా మారారు అంటూ కొందరు అక్కినేని కుటుంబ హీరోల స్పీడ్ ను చూసి షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: