తెలుగు సినిమాలలో అందాలకు కొదవలేదు.. ఎటూ చూసిన అందాలే.. కుర్రాళ్లకు నిషాలెక్కించే అందాలే..యువతను ఆకట్టుకోవడంచాలా మంది హీరోయిన్లు అందాల విందును వడ్డిస్తున్నారు. ఒకరా ఇద్దరా ఎందరో హీరోయిన్లు.. యూత్ కు కళ్లు తిప్పుకోకుండా చేస్తున్నారు. బికినిలతో ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియా లో వదిలేస్తున్నారు. అలా పాపులర్ అయిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. వారెవ్వరూ అనేది ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే:
ముకుందా సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదట్లో నత్తనడకగా సాగిన.. మహిర్షి సినిమాతో హిట్ ట్రాక్ లొకి వచ్చింది.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అలా వైకుంఠపురం లో సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ సరసన ' రాధే శ్యామ్' సినిమాలో నటిస్తుంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుంది.
రష్మిక మందన్నా:
ఈ అమ్మడు కూడా అంతే మొదటి రెండు సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి.తర్వాత కొంచెం డల్ అయ్యింది.ఇప్పుడేమో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.ఇటీవల సరిలేరు నీకెవ్వరూ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.
సమంత:
ఏం మాయచేసిందో గానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమె వెనకాల తిరుగుతోంది.పెళ్లయ్యాక వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఓ బేబీ సినిమాతో ప్రయోగాలు కూడా చేయగలనని నిరూపించింది. ఇప్పుడు అలాంటి ప్రయోగాలతో మరో సినిమాలో కనిపించబోతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే అనుష్క, తమన్నా, కాజల్ , శృతిహాసన్, కీర్తి సురేష్,హేబ్బా పటేల్,నితూ వర్మ,నివేదా థామస్,రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మంది , తమ నటనతో, అందాలతో కవ్విస్తూ మేడం సార్..మేడం అంతే అని సినీ అభిమానులతో అనిపించుకున్నారు..