హన్సిక బికిని షో.. 50వ సినిమా స్పెషల్..!

shami
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుని కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భామ హన్సిక. తెలుగులో ఓ మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు కోలీవుడ్ లో మాత్రం దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కేవలం గ్లామర్ షోకి ఏమాత్రం వెనకాడని ఈ అమ్మడు కెరియర్ లో 50వ సినిమాగా మహా అంటూ రాబోతుంది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే అమ్మడు బికినిలో కూడా కనిపించనుందట.  
ఇన్నేళ్ళ కెరియర్ లో అమ్మడు అందాలతో అలరించినా బికిని మాత్రం వేయాలని ప్రయత్నించలేదు కాని ఇప్పుడు వేయక తప్పట్లేదు. ఇక మీదట బికిని వేసేందుకు కూడా తాను రెడీ అంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది హన్సిక. బికిని వేసేందుకు తగినట్టుగా తన ఫిజిక్ ను మార్చుకుంటుందట. హన్సిక 50వ సినిమా మహాలో అమ్మడి బికిని ట్రీట్ ఉంటుందని తెలుస్తుంది.
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇప్పుడు బికిని వేసేందుకు కూడా రెడీ అవడంతో మళ్ళీ అమ్మడికి వరుస ఛాన్సులు రావడం ఖాయమని చెప్పొచ్చు. ఈమధ్య కాస్త బొద్దుగా మారినట్టు అనిపించిన హన్సిక స్లిమ్ గా మారి బికిని షోతో ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది. మరి హన్సిక చేసే ఈ బికిని షో ఆమెకు ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి. తమిళంతో పాటుగా తెలుగులో కూడా మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్న హన్సిక మునుపటి క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి.                                                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: