నాతో కలసి పంటలు పండించండి: సమంత అక్కినేని

Suma Kallamadi

స్టార్ నటీమణి సమంత అక్కినేని లాక్ డౌన్ సమయంలో తన టెర్రస్ పై గార్డెనింగ్ చేయడం ప్రారంభించారు. మొక్కలను పెంచి కీర దోసకాయ వంటి కూరగాయలు పండించి అందరికీ ఇన్స్పిరేషనల్ గా నిలుస్తున్నారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని వ్యవసాయానికి వాడుకోవాలంటూ ఆమె ప్రతిరోజూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తున్నారు. ఇటీవలే 11 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మైలురాయిని చేరుకున్న సమంత అక్కినేని వార్తలకెక్కారు. ప్రస్తుతం సినిమాల గురించి కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత జీవితం గురించే అనేక వార్తలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా తన టెర్రస్ పై కూరగాయ మొక్కలను పెంచి పెద్ద చేస్తున్న సమంత అక్కినేని ఇటీవల తాను పండించిన కీరదోసకాయను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Gardening is a game changer . Planting a seed can bring change . "Eat Healthy” we hear this far too many times ... but I am telling you "Grow Healthy” is even more simpler . All it takes is a little time and a little effort . And since

A post shared by


'మీ టెర్రస్, బాల్కనీ, కిటికీ..తదితరవి మొక్కలు నాటేందుకు ఉపయోగించండి. వచ్చే కొన్ని వారాల్లో మనందరం కలిసి పంటలు పండిద్దాం. పండించే క్రమంలో మన అనుభవాలను పంచుకుందాం. పండించే క్రమంలో మనం చేసే తప్పులను తెలుసుకుని వాటి నుంచి కొంతైనా నేర్చుకుందాం. చిట్టచివరగా మనకి మనం ఆహారం అందించుకోగలిగినందుకు గర్వపడదాం. లాక్ డౌన్ ప్రకటించగానే భయాందోళనలకు గురై కూరగాయల కోసం పరిగెత్తే వారిలో మనం ఉండకూడదు', అని సమంత అక్కినేని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: