ఎన్నికల వేళ భగ్గుమన్న పల్నాడు.. ఈసీ సీరియస్ అయినా పరిస్థితిలో మార్పులేదా?

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికల వేళ పల్నాడు, పల్నాడు చుట్టుపక్కల ప్రాంతాలలో చోటు చేసుకున్న ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. రెంటచింతల మండలం తుమ్మూరుకోటలో మొత్తం ఆరు పోలింగ్ బూత్ లను అధికారులు ఏర్పాటు చేశారు.
 
అయితే 203, 204, 206 పోలింగ్ బూత్ లలో ఉన్న ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారని తెలుస్తోంది. 205 పోలింగ్ బూత్ లో ఉన్న ఈవీఎం సైతం స్వల్పంగా పగిలిందని సమాచారం అందుతోంది. ఈవీఎంలపై టీడీపీ నేతలు దాడులు చేయడంతో దాదాపుగా రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయిందని సమాచారం అందుతోంది. ఓటమి భయంతోనే పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలుస్తోంది.
 
వైసీపీ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు సైతం చోటు చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టినా పల్నాడులో ఎలాంటి మార్పు రాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి  శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని త్లెఉస్తోంది.
 
గోపిరెడ్డి శ్రీనివాస్ కార్లను ధ్వంసం చేశారని సమాచరం ఈ విషయం తెలిసిన పోలీసులు నిరసనకారులపై రబ్బరు బుల్లెట్లను ప్రయోగించడం జరిగింది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు. పిన్నెల్లి కొడుకుకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యాల విషయంలో సామాన్యుల నుంచి సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతల దౌర్జన్యాలు శృతి మించుతున్నాయని కొందరు టీడీపీ నేతలు పోలీసులకు సైతం ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరు మరీ దారుణంగా ఉందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: