రవితేజ నటించిన భద్ర సినిమాకి 19 ఏళ్ళు..!?

Anilkumar
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన కెరీర్ లోనే భద్ర సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాకుండా బోయపాటి శ్రీను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. అయితే బోయపాటి శ్రీను అభిమానుల ముందుకు తెచ్చిన  సినిమాలో భద్ర సినిమా ది బెస్ట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ కు జోడిగా మీరాజాస్మిన్ నటించిన. ఇక దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి వార్ వంటి తదితరులు కీలక

 పాత్రలలో నటించారు. దర్శకుడు బోయపాటి భద్ర ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీ గా మరియు ఫ్యాక్షన్  బ్రాక్‌డ్యాప్‌ కథను జత చేసి ఈ సినిమాను నిర్మించి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. అయితే మే 12 2005న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించింది. ఇక రవితేజ భద్ర సినిమా ద్వారా మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకు

 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటితో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ చిత్ర బృందం వాళ్ళు ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: