రామ్ డబుల్ ఇస్మార్ట్ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
దేవదాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ పోతినేని. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాని తర్వాత 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో డబుల్ ఇస్మార్ట్ సినిమా ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని కాంబోలో సినిమా వస్తుంది. ఇక వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో శరవేగంగా
 జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ ను పూరి జగన్నాథ్ ముంబైలో ప్లాన్ చేశాడని ఈ సీన్ కు ఏకంగా రూ. 7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఇక ఇదిలా ఉంటే  తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ను ఇచ్చారు. మే 15 న దేవదాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన   రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చెయ్యనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ కి అదిరిపోయే మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్ కు అదిరిపోయే ఆల్బమ్
ని రెడీ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగులోనే కాకుండా తమిళం హిందీ కన్నడ మలయాళంలో జూన్ 14న విడుదల చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: