చార్ట్ బస్టర్ గా అల్లు అర్జున్ పుష్ప పుష్ప సాంగ్..!

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  పుష్ప సినిమాకు కంటిన్యూగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీను మేకర్స్ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే అభిమానుల ముందుకు వచ్చిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇక విషయానికొస్తే రీసెంట్ గా అల్లు

 అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పుష్ప2 సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాటే పుష్ప పుష్ప. ఇక ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ పాట రికార్డింగ్ వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక అల్లు అర్జున్ ఈ పాటలో వేసిన స్టెప్స్ ట్రెండిగా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సాంగ్ ఎంతో స్పెషల్ గా ఉండనుందని సమాచారం. అయితే పుష్పరాజ్ లైఫ్ స్టైల్ మొత్తం ఈ పాటలో చూపించనున్నట్లు సమాచారం. దీనితో అభిమానులంతా సెకండ్ సాంగ్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

 మైత్రీ మూవీ మెకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, జగదీష్ బండారి, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పార్ట్ -1 ను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చెస్తే ఈసారి పుష్ప 2 ను పాన్ వరల్డ్ లెవల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: