బాలీవుడ్ సినిమాని డిటో దించేస్తున్నారట..!

shami

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ సినిమా చేశాడు. ఆ టైటిల్ పెట్టినందుకైనా సినిమా హిట్టు కొట్టాలని అనుకుని మరి మంచి సక్సెస్ అందుకున్నాడు వరుణ్ తేజ్. వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తొలిప్రేమ డైరక్టర్ వెంకీ అట్లూరి అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. మొదటి సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ సెకండ్ సినిమా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక తన నెక్స్ట్ సినిమా నితిన్ హీరోగా రంగ్ దే సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి.

 

ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహానటితో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగులో కూడా తన పాగా వేయాలని చూస్తుంది. నితిన్ తో మొదటిసారి జోడీ కడుతున్న ఈ అమ్మడు సినిమా ఫస్ట్ లుక్ తో అలరించింది. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది. నితిన్, కీర్తి సురేష్ రంగ్ దే నటిస్తున్న సినిమా బాలీవుడ్ మూవీ స్పూర్తితో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. షాహిద్ కపూర్, కరీనా కలిసి నటించిన జబ్ ఉయ్ మెట్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమానే కొద్దిగా అటుఇటుగా మార్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.

 

లాక్ డౌన్ కు ముందే 70 శాతం వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన భాగాన్ని త్వరలో షూట్ చేస్తారని తెలుస్తుంది. భీష్మతో ఈ ఇయర్ మొదట్లో సూపర్ హిట్ అందుకున్న నితిన్ రంగే తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: