రెండిటితో ఫెయిల్ ..... మరి మూడోసారైనా పాసవుతారా .....??

GVK Writings

విక్టరీ వెంకటేష్, విజయశాంతిల కలయికలో 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శత్రువు సినిమాతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా టాలీవుడ్ కి అడుగుపెట్టిన ఎమ్. ఎస్. రాజు, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన దేవి సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించి, నిర్మాతగా రాజుకు మంచి గుర్తింపునిచ్చింది. అనంతరం ఉదయ్ కిరణ్ హీరోగా ఆయన నిర్మించిన మనసంతా నువ్వే సినిమా సంచలన విజయాన్ని అందుకుని ఆయన బ్యానర్ కు మరింత గుర్తింపు తెచ్చింది. 

వాటి తరువాత మహేష్ బాబుతో ఒక్కడు, ప్రభాస్ తో వర్షం, సిద్ధార్థ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ డూపర్ హిట్స్ నిర్మించిన రాజుకు, అప్పట్లో ఊహించని రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు దక్కాయి. తరువాత ఆయన బ్యానర్ నుండి వచ్చిన పౌర్ణమి, ఆట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అనంతరం తన బ్యానర్ పై నిర్మిస్తూ, తొలిసారిగా వాన సినిమాకి దర్శకత్వం వహించిన రాజు, ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తనయుడు సుమంత్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాకు కూడా దర్శకత్వం వహించిన రాజు, మరొక్కమారు దానితో కూడా ఫ్లాప్ ని చవిచూసారు. 

 

ఇక మళ్ళీ ఇన్నేళ్ల తరువాత నూతన నటుడు శ్రవణ్‌రెడ్డి హీరోగా సిమ్రత్‌కౌర్‌, రుహానిశర్మ హీరోయిన్స్ గా డర్టీ హరి మూవీని తీస్తున్నారు. యూత్ ఫుల్, రొమాంటిక్ కథా, కథనాలతో సాగనున్న ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి, దర్శకుడిగా తనకు మంచి బ్రేక్ ని ఇస్తుందని ఎమ్. ఎస్. రాజు భావిస్తున్నారు. తన గత సినిమాల పరాజయం తరువాత డైరెక్టర్ గా ఎన్నో విషయాలు తెలుసుకుని, ఎంతో జాగ్రతగా సినిమా తీశానని, అలానే అన్ని వర్గాల ప్రేక్షకులను డర్టీ హరి ఆకట్టుకుంటుందని ఎమ్. ఎస్. రాజు అంటున్నారు. ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్ ‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో,గూడూరు సతీష్‌బాబు, గూడూరు సాయిపునీత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం మార్క్. కె. రాబిన్ అందిస్తున్నారు. మరి దర్శకుడిగా రెండు సార్లు ఫెయిల్ అయిన ఎమ్. ఎస్. రాజు, మూడో సారి అయినా సక్సెస్ అందుకంటారో, లేదో తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: