మెగా ఛాన్స్ పట్టేసిన మెహెర్ రమేష్..!

shami

పేపర్ మీద రాసుకున్న కొన్ని కథలు తెర మీద పెద్దగా వర్కవుట్ అవ్వవు. అలానే కథలు బాగా చెప్పే డైరక్టర్ ఆ కథలను తెరకెక్కించడంలో విఫలమవ్వొచ్చు. భారీ అంచనాలను ఏర్పరచి డిజాస్టర్ గా మలచడంలో దర్శకుల తప్పు ఏమి లేకున్నా ఎక్కడో తేడా కొట్టడం వల్లే అలా జరుగుతుంది. అలా తెలుగులో స్టార్స్ తో భారీ సినిమాలు చేసి డిజాస్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి మెహెర్ రమేష్. ఈ డైరక్టర్ మొదటి సినిమా కంత్రి సక్సెస్ కాగా ఆ తర్వాత బిల్లాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక శక్తి, షాడో ఇలా స్టార్స్ తో భారీ ఫ్లాపులు తీశాడు.  

 

మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువైన మెహెర్ రమేష్ డైరక్టర్ గా కెరియర్ లో సక్సెస్ అవ్వలేకపోయాడు. వరుస ఫ్లాపులు ఆ డైరక్టర్ తో సినిమా చేయడానికి స్టార్స్ కూడా సాహసం చేయలేదు. మహేష్ పర్సనల్ల్ పి.ఆర్ గా ఉంటున్న మెహెర్ రమేష్ మెగా ఫ్యామిలీకి ఎప్పుడు టచ్ లోనే ఉంటాడు. రీసెంట్ గా చిరు అధ్యక్షతన సీ.సీ.సీ కోసం మెహెర్ రమేష్ బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ మెహెర్ రమేష్ కు ఓ క్రేజీ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని వార్తలు రాగా.. లేటెస్ట్ గా మెగా డాటర్ సుస్మిత నిర్మాణంలో వెబ్ సీరీస్ ఛాన్స్ కూడా అందుకున్నాడట మెహెర్ రమేష్.  

   

సుస్మిత చేయబోయే మొదటి వెబ్ సీరీస్ ను తమిళ దర్శకుడు ఆనంద్ రంగ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుండగా.. రెండో వెబ్ సీరీస్ ను మెహెర్ రమేష్ డైరెక్ట్ చేసే చాన్స్ ఉందట. మరి ఈ వెబ్ సీరీస్ తో అయినా మెహెర్ రమేష్ తన మీద ఉన్న బ్యాడ్ టాక్ పోగొట్టుకుంటాడో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: