అందం అభినయం అనుపమ సొంతం!?

Durga Writes

మలయాళీ భామ అయినా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది అనుపమ. అక్కడ ప్రేమమ్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇంకా  ఆ సినిమాలో ఆమె నటన.. ఆమె అందం చూసి తెలుగులో కూడా అవకాశాలు భారీ ఎత్తులో వచ్చాయి. ఇంకా అంతే తెలుగు ప్రేమమ్ సినిమాలో కూడా నటించింది. 

 

 

ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమాలో నటించింది. ఇంకా ఆ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అందంగా కనిపించి.. డైలాగ్ లతో అందరిని ఆకట్టుకుంది. ఇప్పటికి ఆ డైలాగ్ లు ఎక్కడో ఒక చోటా వినిపిఇస్తుంటాయి. ఇంకా ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. 

 

 

అందంతో పాటు నటన కలగలసి మంచి సినిమాలు చేసింది. అయితే ఏమైందో తెలియదు కాని టిక్ టాక్ కు బానిసయ్యింది. ప్రతి నిత్యం టిక్ టాక్ చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని అలరించింది. అంతేకాదు.. ఫోటో షూట్ లు చెయ్యడం అవి షేర్ చెయ్యడంలో మునిగిపోయింది. 

 

 

ఆ తర్వాత హలో గురు ప్రేమకోసమేనా అనే సినిమాలో నటించింది కానీ మళ్లీ ఏ సినిమాలో నటించలేదు. ఈమధ్య కాలంలో అయితే ఈ సినిమాలో కనిపించడం లేదు. మరి ఈ అందాల నటన బొమ్మ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏది ఏమైనా నటన పరంగా ఈ కేరళ కుట్టిని పేరు పెట్టెకి లేదు. మరి మీరు ఏం అంటారు ? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: