అంజలి వెనుకున్న ఆ వ్యక్తి ఎవరు?

Seetha Sailaja
అదృష్టం కలిసి వచ్చినా సరైన ప్లానింగ్ లేకపోతే కెరియర్ ఎలా దెబ్బ తింటుందో అనే విషయానికి నిదర్సనమే అంజలి. రాజోల్ బ్యూటీ అంజలి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్ధం కావడం లేదు కానీ తన సినీ జీవితాన్ని తెలిసితెలిసి నాశనం చేసుకుంటోoదని టాలీవుడ్ విశ్లేషకుల కామెంట్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తిరుగులేని పేరు తెచ్చుకున్న అంజలి ఈ పాటికి టాలీవుడ్ నెంబరు వన్ హీరోయిన్ గా ఎదగాల్సిన పరిస్థితి. కానీ అంజలి మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఉండటం ఎవరికీ అర్ధం కాని విషయం.. సీతమ్మ సినిమా తర్వాత కోర్టు గొడవలు, పిన్నితో గొడవలలు, అజ్ఞాతంలోకి వెళ్ళడం ఇలా అన్ని రకాలుగా అంజలి ఇబ్బందులను కొని తెచ్చుకుం అని అంటారు. లావైపోవడంతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అంజలిని పూర్తిగా పక్కనపెట్టేశారు. అయితే అంజలి ఇప్పుడు కాస్త బరువు తగ్గి మళ్ళీ కథలు వింటుంది. అయితే కథను చెప్పడానికి వెళ్ళిన దర్శక, నిర్మాతలకు అంజలి ఒక విచిత్రమైన కండిషన్ పెడుతోందట. ఒక వ్యక్తిని కలిసి ముందుగా ఆ కధను వినిపించమని మన రాజోలు అమ్మాయి చెపుతోంది అని టాక్. ఆ వ్యక్తి టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత అని అంటున్నారు. తీరా ఆనిర్మాత దగ్గరకు వెళితే లేడి ఓరియంటెడ్ కథలను అయితేనే వింటానని చెప్పడంతో ఆ దర్శకులు వెనక్కు తిరిగి వచ్చేస్తున్నారట. మరి ఇంతకీ అంజలి ఆనిర్మాత చేతిలో ఎందుకు పావుగా మారిపోయింది అనే విషయం పై రకరకాల కధలు బయట వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: