20 రోజుల్లో ఎన్నో విషాదాలు.. ఉపాసన భావోద్వేగపూరిత పోస్ట్..?

praveen

టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ సతీమణి.. కొణిదెల వారి కోడలు ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అప్డేట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా అభిమానులు అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను  పోస్ట్ చేయడంతో పాటు.. ఎప్పటికప్పుడు సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఎంతో ధైర్యంగా అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది కొణిదెల వారి కోడలు  ఉపాసన. 

 


 అయితే తాజాగా ఉపాసన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గత ఇరవై రోజుల్లో ఎన్నో విషాద ఘటనలను అంటూ ఒక భావోద్వేగ పూరితమైన ఈ పోస్టు పెట్టింది ఉపాసన. తమ కుటుంబంలో ముగ్గురు పెద్ద వాళ్ళని కోల్పోయామని తెలిపిన ఉపాసన... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి బాధాకర వార్త విన్నాము అంటూ తెలిపింది. అంతేకాకుండా దేశంలో కరోనా  కేసులు వృద్ధి కూడా ఎంతగానో పెరిగిపోతుంది అంటూ తన పోస్టులో  తెలిపింది. 

 


 ఇక మన దేశాన్ని రక్షించడానికి ఏకంగా 21 మంది జవానులు ప్రాణాలు అర్పించి అమరులు  అవ్వడం కూడా ఎంతగానో కలిచివేసింది అంటూ తెలిపింది ఉపాసన. సరిగ్గా వారం రోజుల క్రితం తమ 8 వ పెళ్లిరోజు తేదీ వచ్చింది అంటూ తెలిపిన ఉపాసన... కానీ తన పెళ్లి రోజున జరుపుకునే మూడ్  లో తాము లేము అంటూ చెప్పుకొచ్చింది. తాము ఇంట్లో ఉంటూ ఆవకాయ పచ్చడి తో అన్నం తింటూ చిప్స్ తింటూ టీవీ చూస్తూ సమయాన్ని గడపామని... చెర్రీతో కలిసి ఉంటూ కలిసి ఉండటం లోని  ఎన్నో పాటలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. ఇక ఉపాసన పెట్టిన ఈ భావోద్వేగ పూరితమైన పోస్టు మీడియాలో వైరల్ అవుతుంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The last 20 days have emotionally drained us. We’ve lost 3 elderly in the family, heard sad {{RelevantDataTitle}}