నాగబాబు షాకింగ్ వీడియో.. చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..?

Chakravarthi Kalyan
మెగా బ్రదర్ నాగబాబు.. తన నా ఇష్టం ఛానల్ ద్వారా తన అనుభవాలు పంచుకుంటుంటారు. ఆయన ఎక్కువగా ఈ ఛానల్‌లో తన విమర్శలు, తన కౌంటర్లు ఇస్తూ ఉంటారు. గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు ఈ చానల్ ద్వారానే చేశారు. అయితే తాజాగా ఆయన పోస్టు చేసిన ఓ వీడియో మాత్రం విమర్శలకు అతీతంగా జంతు ప్రేమికులను అలరించేలా ఉంది.

పెంపుడు జంతువుల గొప్పదాన్ని వివరించిన నాగబాబు... తనకు కుక్కలతో చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఇటీవల విదేశాల్లో తన యజమానిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు అది చేసిన హడావిడి చూసి.. ఆయన షాకయ్యారట. ఓ కుక్క మనిషిని ఇంతగా ప్రేమిస్తుందా అంటూ ఆశ్చర్యపోయారట. ఆ వీడియోను గుర్తు చేసుకుంటూ.. తన పాత జ్ఞాపకాలను నాగబాబు పంచుకున్నారు.

ఒళ్లో ఒక కుక్క, అటూ ఇటూ కుక్కలను పెట్టుకుని తన అనుభవాలు పంచుకున్నారు. చిన్నప్పుడు కుక్కలని పెంచుకుందామనుకుంటే ఇంట్లో వీలయ్యేదికాదని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తమ తల్లికి పనిభారం ఎక్కువగా ఉండడంతో కుదిరేది కాదని తెలిపారు. డిగ్రీలో ఉన్నప్పుడు ఓ కుక్కపిల్లను తెచ్చుకున్నామన్న నాగబాబు.. ప్రస్తుతం తన వద్ద ఉన్న కుక్కలను పేర్లతో సహా పరిచయం చేశారు.

ఆదిమానవుడు గుహల్లో జీవించిన కాలం నుంచి కుక్కలు అలవాటయ్యాయన్న నాగబాబు.. జీవితంలో మనిషి ఒక్కసారైనా కుక్కను పెంచకపోతే జీవితం సంపూర్ణం కాదని తేల్చి చెప్పేశారు. నిజంగానే పెంపుడు జంతువు ఏదైనా సరే.. దాని పెంపకం, అనుబంధం.. వాటిని పెంచినవారే తెలుస్తుంది.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/dxIhEU1-NKc" width="560" height="314" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: