కరోనా లెక్కలు చెప్పి ఇండస్ట్రీని భయపెడుతున్న తేజా !

Seetha Sailaja

దర్శకుడు తేజా ఇప్పుడు ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరికన్నా చాల సీనియర్. వాస్తవానికి తేజాకు ఉన్న క్రియేటివిటీకి ఎప్పుడో స్టార్ డైరెక్టర్ గా మారిపోయి ఉండాలి. అయితే ఎవర్నీ లెక్కచేయని తేజా మనస్తత్వం అతడిని టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలకు దూరం చేసి తేజాను కేవలం మిడిల్ రేంజ్ దర్శకుడుగా మాత్రమే పరిమితం చేసింది.


ప్రస్తుతం తేజా గోపీ చంద్ తో ‘అలివేలు వెంకటరమణ’ మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే కరోనా సమస్యలు రావడంతో ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఆస్కారం కనిపించడం లేదు. దీనికితోడు తేజా కోరుకున్న హీరోయిన్స్ అనుష్క సాయి పల్లవి అంగీకారం ఈమూవీకి సంబంధించి ఇప్పటికీ లభించక పోవడంతో తేజా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.  


ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా గురించి చెప్పిన లెక్కలు విషయాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు హడలిపోతున్నాయి. కరోనా కేసుల విషయంలో మరో రెండు నెలలులో భారతదేశం నెంబర్ వన్ స్థాయికి చేరిపోతుందని సుమారు 2-3 కోట్ల కేసులు భారత్ లో వచ్చినా ఆశ్చర్యం లేదు అని తేజా అంటున్నాడు.


వాస్తవానికి భారత్ లో మరో రెండు నెలలలో కరోనా కేసుల సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుంది అని వస్తున్న వార్తలు చూసి జనం అదిరిపోతుంటే తేజా కరోనా భవిష్యవాణి విని ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఇదే సందర్భంలో తేజా మరొక ట్విస్ట్ ఇస్తూ ఆఖరికి డెబిట్ కార్డులు స్వైప్ చేసిన తరువాత ఆ మిషన్ లో కూడ కరోనా దాక్కుని ఉందని భయపడి ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు వెళ్ళినతరువాత ఆ కార్డును మన చేతులులాగే సుభ్రపరుచుకోవాలి అని తేజా చెపుతున్న  మితిమీరిన జాగ్రత్తలు చదివిన వారికి తేజాకు ఈ స్థాయిలో కరోనా భయాలు ఎందుకు ఏర్పడ్డాయి అని అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: