చాలా సీక్రెట్ గా, సింపుల్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ ...!
కన్నడ చిత్రసీమలో హీరోయిన్ గా కొనసాగుతున్న మయూరి క్యాటరీ లాక్ డౌన్ సమయం లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడైన అరుణ్ ని ఆమె వివాహం చేసుకుంది. నేడు ఉదయం స్థానిక శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం చాలా సింపుల్ గా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య మాత్రమే వారి వివాహం జరిగింది.
auto 12px; width: 50px;">View this post on InstagramYes I am married❤️ 12/06/2020 10 years of friendship given a meaning today ❤️ Vl update more shortly A post shared by mayuri (@mayurikyatari) on
నిజానికి ఆ హీరోయిన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేసేంతవరకు కూడా ఆమె వివాహం గురించి అటు అభిమానులు, ఇటు సినీ వర్గాల వారికి ఎవరికీ తెలియక పోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. తన పోటోలను " అవును నేను అరుణ్ ఈరోజు ఉదయం వివాహం చేసుకున్నాం. ఆ పదేళ్ల స్నేహానికి ఈరోజు అర్థవంతమైన ముగింపు లభించింది " ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మా పెళ్ళికి సంబంధించిన మరింత సమాచారం కూడా త్వరలోనే అందిస్తాము అని తెలిపింది. ఇక మరో పోస్టులో అరుణ్ తన మెడలో మూడుముళ్లు వేస్తున్న వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇకపోతే తమ అభిమాన హీరోయిన్ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నప్పటికీ కొత్త జంటకు శుభాకాంక్షలు వారి స్టైల్లో తెలుపుతున్నారు. ఈ కొత్త జంటకి సోషల్ మీడియా తరపున కన్నడ ఆర్టిస్టులు కూడా చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీవీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని మొదలుపెట్టిన మయూరి 2015 సంవత్సరంలో కృష్ణ లీల అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ తర్వాత అనేక సినిమాలో నటించి కన్నడ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకుంది నటి మయూరి.