సినిమా షూటింగ్ టైం అంటే టైమే అనే ఎన్టీఆర్...!

Gullapally Venkatesh

ఎన్టీఆర్... అనగానే చాలా మందికి క్రమశిక్షణ. ఆయన పేరు వినగానే చాలా మందికి కళ్ళ ముందు కనపడేది క్రమ శిక్షణ. సినిమాలు అయినా రాజకీయాలు అయినా సరే ఎన్టీఆర్ ముందు క్రమశిక్షణ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండే వారు. ఆయన జీవితంలో ఎన్ని సినిమాలు చేసి ఎంత స్టార్ ఇమేజ్ వచ్చి ఇండియన్ సూపర్ స్టార్ అయినా సరే ఆయన మాత్రం ఎక్కడా క్రమ శిక్షణ విషయంలో రాజీ పడిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. రాజకీయాల్లో అయినా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. సినిమాల్లో నటులు రాజకీయాల్లో నాయకులు అందరూ కూడా క్రమ శిక్షణ తో ఉండాలని చెప్పారు ఎన్టీఆర్. 

 

ఆయన కూడా దానిని అదే విధంగా పాటించి అందరికి ఆదర్శంగా నిలిచారు ఎన్టీఆర్. రాజకీయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు అయినా సినిమాల షూటింగ్ కి వెళ్ళే సమయంలో ఆయన ప్రవర్తించే విధానం అయినా సరే ఆయన క్రమ శిక్షణ ఏ స్థాయిలో ఉంటుందో చెప్తూ ఉంటుంది. ఆయన  వలన ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని భావించిన ఎన్టీఆర్ అదే విధంగా ప్రవర్తించే వారు. తన వారసులకు కూడా ఇదే విషయాన్ని ఎన్టీఆర్ పదే పదే చెప్తూ ఉండే వారు అని అంటారు. ఆయనను దగ్గరగా చూసిన వాళ్లకు ఆయనలో బాగా నచ్చింది ఆయన క్రమ శిక్షణ అని అంటారు. 

 

సినిమా షూటింగ్ టైం ఇది అంటే అదే టైం కి ఆయన వచ్చి అందరిని కూడా అదే టైం కి రావాలి అని చెప్పి ఎన్టీఆర్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆయన చూపించిన మార్గం ఇప్పటికి బాలకృష్ణ కూడా అనుసరిస్తూ ఉంటారని అంటారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ కి సరిగా సమయానికి వస్తూ ఉంటారని ఆయనను దగ్గరగా చూసిన ఎందరో చెప్పిన మాట కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: