ఉపాధి దొరక్క పండ్లు అమ్ముతున్న సినీనటుడు ...!

Suma Kallamadi

 


గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీంతో అనేక మంది జీవితాలు రోడ్డున పడ్డాయి కూడా అని అనుకోవచ్చు. ఇక ఇలాంటి వార్తలు విషయానికి వస్తే వలస కూలీలు గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. పనులు లేక కొన్ని లక్షల కూలీలు రోడ్డు మీద పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే... ఈ వైరస్ కారణంగా సినీ పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు పడింది. షూటింగులు జరగకపోవడంతో సినీ పరిశ్రమకు సంబంధించిన వారందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీనితో వారికి సంపాదన లేకుండా పోయింది. చాలామంది నిరాశ్రయులయ్యారు కూడా. పెద్ద పెద్ద వారు అయితే ఈ పరిస్థితి తట్టుకోగలరు. కానీ చిన్న చిన్న నటీనటులు మాత్రం ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

 

అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ లో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం డ్రీమ్ గర్ల్. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్. నిజానికి ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు రోడ్లమీద పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు. అయితే ప్రస్తుత దృష్టితో షూటింగ్ లు లేకపోవడంతో ఆయన తిరిగి మళ్ళీ రెండు నెలలుగా పండ్లు అమ్ముకుంటూ తన కుటుంబానికి అండగా నిలవడం జరుగుతోంది. సోలంకి అనేక సినిమాల్లో సహచర పాత్రలో నటించిన విషయం అందరికి తెలిసిందే.

 

కొన్ని రోజుల క్రితం షూటింగ్స్ లేక చేతిలో డబ్బులు లేక మానసిక ఆందోళనకు గురైన మన్విత్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా సరే వారి పరిస్థితిని ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒకరిపై ఆధారపడకుండా సొంత స్వయం కృషితో కష్టపడితే ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: