లోకనాయకుడు కమల్ హాసన్ , స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కతున్నచిత్రం 'ఇండియన్ 2'. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్ లో క్రేన్ ప్రమాదం జరగడం వల్ల ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ న్యూస్ సెన్సేషన్ సృష్టించింది. ఇక అప్పటినుండి సినిమా షూటింగ్ తాత్కాలింగా వాయిదాపడింది అయితే మరో సారి ఇప్పడు ఈ చిత్రం వార్తల్లో నిలిచింది.
ఇండియన్ 2 నిడివి ఎక్కువగా ఉంటుందని దాంతో ఈ చిత్రాన్ని రెండు పార్టులు గా విడుదలచేయనున్నారని వార్తలు వచ్చాయి ఇక దీనిపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అవన్నీరూమర్స్ అని ఇండియన్ 2 ఒకటే పార్ట్ గా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చింది అంతేకాదు లాక్ డౌన్ ముగిశాక మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపింది.
సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ ,సిద్దార్థ్ , వెన్నల కిషోర్, విద్యుత్ జంవాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు అలాగే వీరితోపాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈసినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 1996లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం తమిళం తో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజీయాల్లో బిజీ కానున్నాడు. ఇప్పటికే కమల్ పార్టీని కూడా స్థాపించాడు.