ఇదే కాజల్ బెండకాయ పులుసు, పెసరట్టు.. ఎప్పుడైనా చూసారా..?

praveen

అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు తన హవా నడిపిపించింది. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ దాదాపుగా టాలీవుడ్ లో అందరు హీరోల సరసన నటించింది. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చిరంజీవి 152వ సినిమాగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

 


 ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం లాక్ డౌన్  అమలులో ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు సినీ ప్రముఖులు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సినీ ప్రముఖులు. కొంతమంది ఫిట్నెస్పై కూడా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ వంట నేర్చుకోవడం పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన వంట కు సంబంధించి పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 నేను నా మూవీ సెట్స్ ని  చాలా మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్... ఇక ఈ ఖాళీ సమయంలో ఆంధ్రా స్పెషల్ మీల్స్ నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది. ఇక్కడ నేను తయారుచేసిన ఫస్ట్ వంటకం ఉంది చూడండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది కాజల్ అగర్వాల్. బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి,  పెసరట్టు అంటూ తాను తయారుచేసిన వంటకాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  అది కాస్త వైరల్ గా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: