ఇన్నాళ్లనుంచి తిరిగి తిరిగి అరిగిపోయేలా స్టోరీలు చెప్పి.. మొత్తానికి ఎన్టీఆర్ తోసినిమా ఓకే చేయించుకున్నాడు ప్రశాంత్ నీల్. చేసింది తక్కువ సినిమాలైనా..ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో ఆల్ ఓవర్ ఇండియాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు . కెజిఎఫ్ 2 తో మరో భారీ సక్సెస్ కి రెడీ అవుతున్నాడు . కన్నడలో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ తెలుగులో పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమా చెయ్యాలని కలలు కంటున్నాడు . అందుకే అటు మహేష్ తో, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా సినిమా చెయ్యడానికి ఆరాటపడుతున్నాడు.
టాలీవుడ్ హీరోలకు స్టోరీ లైన్స్ వినిపించినా.. వాళ్ల ఇమేజ్ కు తగ్గ స్టోరీలు చెబుతున్నా.. అదిగో ఇదిగో అంటూ వెయిట్ చేయిస్తున్నారు . కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్టీఆర్ తో సినమాకోసం ప్రయత్నిస్తూనేఉన్నాడు ప్రశాంత్ . కెజిఎఫ్ 2 టైమ్ లో ఎన్టీఆర్ ని ఫిల్మ్ సిటీలో కలిసినప్పుడు చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ ఫ్యూచర్ లో సినిమా చేద్దామని చెప్పాడట.
ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆఱ్ తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ కూడా కెజిఎఫ్ 2 మూవీతో ఎంగేజ్ అయిపోయాడు . ఇప్పుడు కెజిఎఫ్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఎన్టీఆర్ తో సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు ప్రశాంత్ . సో.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక మరో ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రెడీ అవుతున్నాడు కెజిఎఫ్ డైరెక్టర్ . ఇన్నాళ్లూ వాళ్ల చుట్టూ వీళ్లచుట్టూ తిరిగిన ప్రశాంత్ ఇప్పుడు తెలుగులో జెండా పాతబోతున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: