పూజా హెగ్డే సినిమాలు హిట్ అవ్వడానికి మెయిన్ అవే కారణమట.. బాబోయి
తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లకు ఎక్కడ కొదవ లేదన్న విషయం తెలిసిందే..వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎందరో కొత్త హీరోయిన్లు ఇక్కడికి వచ్చి మంచి హిట్ సినిమాలలో నటించడంతో పాటుగా యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నారు..అంతేకాదండోయ్ అందాలను ఆరబోసిన తర్వాతే అమ్మడుకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా హవాను కొనసాగిస్తుంది..
మొదటగా ఈ అమ్మడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించింది..ఆ యాడ్ కాస్త చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతల కళ్ళలో పడింది.. దాంతో అమ్మడు అందానికి మెచ్చిన దర్శకులు సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు..ఇక పూజా సినిమాల విషయానికొస్తే.. ముకుందా సినిమా ద్వారా వరుణ్ తేజ్ సరసన నటించిన పూజ ఆ సినిమాలో అనుకున్నంత హిట్ అందుకోలేక పోయిన కూడా అమ్మడు అందానికి యువత దాసోహం అవ్వడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించింది ఆ సినిమా ఓ మాదిరిగా హిట్ అవ్వడంతో వరుస సినిమా అవకాశాలను అంది పుచ్చుకుంది.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమాలో పూజ హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాలో అమ్మడు అందాన్ని ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.. దాంతో పడిపోయిన దర్శక నిర్మాతలు పూజ తో సినిమాలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు..
మహర్షి సినిమా లో మహేష్ బాబు సరసన నటించిన పూజా ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి ఫామ్ లోకి వచ్చింది.. ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.. ఇకపోతే ఇటీవల సంక్రాంతికి విడుదల అయినా బన్నీ సినిమా అల వైకుంఠపురం లో సినిమాలో నటించింది.. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్. గా నటిస్తుంది.