ఆ దర్శకుడుతో మరో సారి సినిమా చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ ..

Satvika

తెలుగు యూత్ ఐకాన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈయన పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. పవన్ ఎన్నో అవార్డుల ను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమాను లను సంపాదించుకున్న నటుడు. అలాంటిి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమై న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. అందుకే ఆయన పేరు వినపడగా నే యూత్ పునకం తో ఊగిపోతారు...

 

 

 

 

పవన్ సినిమా మొదలైందంటే సినిమాలు థియేటర్ నుంచి వెళ్లేవరకు అభిమానుల హంగామా మామూలు గా ఉందన్న విషయం తెలిసిందే.. రెండేళ్లు సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు.. ఇటీవల వరుస  సినిమాలbను ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ను పలకరించడానికి 'వకీల్ సాబ్' సిద్ధమవుతోంది. ఇక క్రిష్ దర్శకత్వంలోను .. హరీశ్ శంకర్ దర్శకత్వం లోను చెరో సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించి న సన్నాహాలు జరుగుతున్నాయి.

 

 

 

ఈ నేపథ్యం లో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని ఒక కథను పవన్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ హీరోగా కిషోర్ కుమార్ పార్థసాని 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించగా, 'గోపాల గోపాల'కి మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు చేయనున్నది మూడో సినిమా అన్నమాట. ఈ విషయం పై త్వరలోనే పూర్తి వివరాలను అధికారంగా వెలువడే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: