సింప్లిసీటీకి కేరాఫ్ అడ్రస్.. హీరో అజిత్ కుమార్..

siri Madhukar

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు నటుడు.  అంతేగాక హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయె హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.   అజిత్ కుమార్  తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. గొల్లపూరడి మారుతీరావు తనయుడు దర్శకత్వం వహించిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో హీరోగా మరాడు. అజిత్ కుమార్ కేవలం పది వరకే చదివాడు.. కానీ   బహుభాషాకోవిదుడు.  తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.  

హీరో అజిత్ ఎంత గొప్ప హీరో అయినా ఎంతో సాదా సీదాగా ఉంటారు.  దక్షిణాదిన చాలా సింపుల్ గా ఉండే హీరో ఎవరు అంటే వెంటనే అజిత్ అంటారు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు.  మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొదారు. అంతే కాదు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు.  2004లో బ్రిటిష్  ఫార్ములా సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు.

అజిత్ తన యువకుడిగా ఉన్న బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం.. అందుకోసం బైక్ మెకానిక్ తన జీవితాన్ని ఆరంభించాడు.  1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టినా.. తమిళనాట మంచి విజయాలు అందుకోవడంతో అక్కడే స్థిరపడ్డాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు సంతానం. అజిత్ కుమార్ ఎంత సింపుల్ వ్యక్తి అంటే.. ఓటింగ్ సమయంలో ఓ సాధారణ వ్యక్తిగా క్యూ లైన్లో నిల్చుని ఓటే వేయడం అలవాటు.. తన పిల్లలో రోడ్లపైనే సింపుల్ గా తిరుగుతుంటారని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: