క్రాక్ తో హిట్ పక్క అంటున్న రవితేజ ...!

Gullapally Rajesh

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరో రవి తేజా. ఆయన తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ముందుకు వచ్చే వారు. నిర్మాతలు కూడా ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. మంచి క్రేజ్ ఉండటం తో పెట్టుబడి పెట్టదానికు ఏ విధంగా కూడా భయపడే అవకాశం ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయనకు అసలు క్రేజ్ లేదని అంటున్నారు. ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న దర్శకులు కూడా ఆయన తో సినిమా చేసే ఆలోచనలో లేరు అని అంటున్నారు. 

 

ఆయన సినిమాలకు ఆదరణ లేదు అనే భావన లో ఉన్నారట. దీనితో ఇప్పుడు రవి తేజా చాలా వరకు జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు. ఆయన తో సినిమా చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు లేకపోవడం తో తానే ఇప్పుడు తన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాలి అనే ఆలోచన లో ఉన్నాడు అని అంటున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆయన సినిమాలకు ఇప్పటికే అతను పరోక్షంగా పెట్టుబడులు పెడుతున్నాడని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ జనాలు ఎవరూ కూడా అతని సినిమాల మీద అంత సానుకూలంగా లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇక అతని సినిమాలకు సైడ్ నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని సమాచారం. ఇది అతని కెరీర్ లో చాలా కీలక పరిణామం. చిన్న చిన్న హీరోలు కూడా మంచి మంచి దర్శకులతో సినిమాలు చేస్తుంటే ఆయన మాత్రం ఎవరి తో సినిమా చెయ్యాలో అర్ధం కాలేక ఇబ్బందులు పడుతున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం మన తెలుగులో బాగా ఇబ్బంది పడే హీరో ఆయనే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: