ఎన్టీఆర్ ,లక్ష్మి పార్వతి అనుబంధం పెళ్లి వరకు ..!

Gullapally Venkatesh

భారతీయ సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా సరే ఎప్పటికి చెరగని ప్రేమ కథ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి. ప్రేమ కథ అంటే ఎన్టీఆర్ అభిమానులు అంగీకరించకపోవచ్చు ఏమో గాని దాదాపుగా అది ప్రేమ కథే. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆమెకు దగ్గర కావడం చివరికి రాజకీయ పార్టీ ని కూడా ఆమెకు ఇవ్వడం ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినా సరే ప్రభుత్వం కూడా ఆమె చేతుల్లో పెట్టడం వంటివి నిజంగా అప్పట్లో సంచలనం తెలుగుదేశం పార్టీ చీలికకు ప్రధాన కారణం లక్ష్మీ పార్వతి అనేది చాలా మంది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం. 

 

అందుకే చంద్రబాబుకు వాళ్ళు మద్దతు ఇచ్చారు. రాజకీయం పక్కన పెడితే అప్పటికే ఎన్టీఆర్ కి పెళ్లి అయినా దాదాపు 65 ఏళ్ళు దాటినా... భార్య చనిపోవడంతో ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతి బాగా దగ్గరయ్యారు. అప్పటికే ఆమెకు వివాహం కూడా అయింది. అయినా సరే ఆమె మాత్రం ఎన్టీఆర్ ని ప్రేమించా అని చెప్పి వచ్చి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అప్పట్లో అత్యంత వివాదాస్పదం కూడా. రాజకీయంగా కూడా ఇది అనేక సంచలనాలకు వేదికగా మారింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఇది అత్యంత పెద్ద తప్పు అంటారు. 

 

ఎన్టీఆర్ అనవసరంగా అప్పుడు తొందరపడటం తో పార్టీ నాశనం అయిందని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఆమె ఎన్టీఆర్ కి అప్పుడు భారంగా మారింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెకు వివాహం జరిగినా కొడుకు ఉన్నా సరే భర్తను వదిలేసి వచ్చి ఎన్టీఆర్ ని వివాహం చేసుకున్నారు. ఆమెను అప్పుడు నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవడం అన్నీ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: