ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా....??

GVK Writings

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదటగా మంచు మనోజ్ హీరోగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి, ఆ తరువాత మంచు విష్ణు సరసన వస్తాడు నా రాజు సినిమాలో కూడా నటించింది. ఇక ఆపై రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఆమె నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని నటిగా తాప్సి కి గుర్తింపుని, మంచి కమర్షియల్ సక్సెస్ ని తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ భాషల్లో కూడా మెల్లగా అవకాశాలు అందుకున్న తాప్సి, ఆపై వాటి ద్వారా మంచి విజయాలు కూడా తన ఖాతాలో వేసుకుంది. 

 

ఇక ఇటీవల అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ గేమ్ ఓవర్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న తాప్సి, ప్రస్తుతం లాకౌట్ ప్రకటించి సినిమా షూటింగ్ అన్ని బంద్ కావడంతో, చక్కగా తన ఫ్యామిలీ తో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తోంది. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండే తాప్సి, ఇటీవల మూడు రోజుల క్రితం తనకు మూడేళ్ళ వయసున్నపుడు బొమ్మ తుపాకీ పట్టుకుని దిగిన ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

 

ఇది నా చిన్నప్పటి ఫోటో, కాకపోతే అప్పుడు ఏ సమయంలో ఆ ఫోటో తీశారో కరెక్ట్ గా తనకు గుర్తు లేనప్పటికీ, ఆ ఫోటో ని బట్టి చూస్తుంటే మంచి కిల్లర్ స్వభావం గల దానినని అర్ధం అవుతోంది అంటూ సరదాగా దానికి క్యాప్షన్ ఇచ్చారు తాప్సి. అయితే ఆ ఫోటోని చూసిన పలువురు ఆమె స్నేహితులతో పాటు ఫ్యాన్స్ సైతం సో క్యూట్ తాప్సి, నిజంగా ఆ వయసులో చాలా చక్కగా ఉన్నావు అని కొందరు అంటుంటే, మరికొందరేమో ఇప్పుడు కూడా అచ్చంగా అదే పోలికలతో ఉన్నావు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Don’t remember any story behind this one just that it reminds me since when I have the ‘killer instincts’ 😜 #SuperMajorThrowback #Archives #QuarantinePost

A post shared by Taapsee Pannu (@taapsee) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: