చిరంజీవి తో సినిమాకు హీరోయిన్ లు ముందుకి రావడం లేదా...?

Gullapally Rajesh

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి ఎందరో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్న చిన్న నటులు కూడా ఆయనతో సినిమాలో కనపడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి కి మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆయనకు ఏదైతే క్రేజ్ ఉందో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టినా సరే అతని సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక దర్శకులు కూడా ఆయనతో సినిమా చేసేందుకు గాను ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 

 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి మరో సినిమా ఎవరితో చెయ్యాలి అనే దాని మీద తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఆయన కోసం చాలా మంది స్టార్ దర్శకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా. అయితే చిరంజీవి మాత్రం కథలు విని ఆ కథలు నచ్చిన తర్వాతే సినిమాలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే కొరటాల శివతో ఆయన చేసే సినిమా మీద అందరికి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది స్పష్టత రావడం లేదు. 

 

ముందు త్రిష అన్నారు, ఆ తర్వాత ఆమె తప్పుకోవడం తో మరో హీరోయిన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. కాజల్ ని ఎలా అయినా సరే ఒప్పించాలని భావించారు. కాని కాజల్ మాత్రం ఒప్పుకోలేదని టాక్. ఇక ఆ తర్వాత అనుష్క ని అడిగారు. అనుష్క కూడా చిరంజీవి తో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదని అంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలియకపోయినా సినిమా షూటింగ్ లో కీలక భాగం అడవుల్లో రాత్రి సమయాల్లో చిత్రీకరిస్తారని, దీనితో హీరోయిన్ లు భయపడుతున్నారని అంటున్నారు. మరి ఎంత వరకు నిజమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: