నిహారిక విషయంలో చిరుకు ,నాగబాబుకి మనస్పర్ధలు వచ్చాయా ..?

Gullapally Rajesh

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు ప్రభావం చూపిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  వారికి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. కాని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక ను మాత్రం పక్కన పెట్టారు. దీనికి కారణం ఏంటో తెలియకపోయినా ఆమె సినిమాలు చేయడానికి మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనికి కారణం ఏంటో తెలియదు గాని ఆమె మీద కుటుంబ పెద్దల ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. 

 

ముఖ్యంగా చిరంజీవి ఆమెను హీరోయిన్ గా వద్దని చెప్తున్నారట. అయినా సరే నాగబాబు ఆమెతో సినిమాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల ఒక చిన్న హీరో సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. అయినా సరే చిరంజీవి అడ్డం పడి వద్దని చెప్పారట. మన కుటుంబం నుంచి మహిళలు ఎవరూ సినిమాల్లోకి వెళ్లలేదని, నందమూరి కుటుంబం నుంచి కూడా మహిళలు ఎవరూ సినిమాల్లోకి వెళ్ళలేదు అని, అవసరం అయితే నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకోవాలి గాని హీరోయిన్ గా అసలు వద్దని చెప్పారట చిరంజీవి. 

 

కాని నాగ బాబు మాత్రం ఈ విషయంలో చిరంజీవికి ఎదురు చెప్పారని అంటున్నారు. దీనితో చిరంజీవికి నాగ బాబుకి మధ్య విభేదాలు వచ్చాయని కొందరి టాక్. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని, సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. దర్శకులకు కూడా చిరంజీవి చెప్పెసారట. సినిమాల్లోకి నిహారిక ను తీసుకోవద్దూ అని. ఇటీవల ఆమె చేసిన ఒక ఫోటో షూట్ పై కూడా చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసారట. అందుకే నిహారిక ఇప్పుడు సినిమా ప్రయత్నాలు పూర్తిగా మానేసింది అంటున్నారు. కాని నాగబాబు మాత్రం ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: