దొరబాబు దెబ్బకు కుదేలుమన్న జబర్దస్త్ షో .. రాబోయే ఎపిసోడ్స్ లో భారీ మార్పులు..

Kothuru Ram Kumar

జబర్ధస్త్ కామెడీ షో గురించి తెలియని వారు వుండరనడంలో అతిశయోక్తి లేదు. ఆ షోలో కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న దొరబాబు, ఇటీవల విశాఖపట్నంలో వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడటం బుల్లితెర వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇక దొరబాబు దెబ్బకు, జబర్దస్త్ కుదేలుమన్న సంగతి తెలిసినదే కదా. ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకునే.. మల్లెమాల సన్నిహిత వర్గాలు.. రాబోయే షోస్ లలో భారీ మార్పులు, చేర్పులు చేయనున్నారట!

 

మొత్తానికి ఆ దెబ్బతో ఇరు దొరబాబు పరువు, అటు జబర్దస్త్ పరువు కలిసి ఒకేసారి గంగలో కలిసినంత పని అయ్యింది. ఇక ఈ తుచ్ఛమైన కార్య కలాపం వలన ఆడియన్స్ దృష్టిలో దొరబాబు జఫ్ఫా అయ్యాడు. దీంతో తన టీం లో వున్న అత్యంత కీలకమైన వ్యక్తుల్లో దొరబాబు ఉండటంతో హైపర్ ఆది కి బ్లడ్ ప్రెషర్ పెరిగి నట్లు అయ్యింది. అతని ప్లేస్ లో వేరొకరిని తీసుకోవాలా... లేదంటే వాడినే కొనసాగించాలా అనే సందిగ్ధంలో పడిపోయాడట హైపర్. 

 

ఇక తాజా పరిణామాల దృష్ట్యా... ఇలాంటి వారితో పెట్టుకుంటే మల్లెమాల పరువు పోతుందని భావించిన సదరు మానేజ్ మెంట్ టీమ్.. దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు సమాచారం. ఇక చేసేదేమి లేకనో, వేరే ఆప్షన్ లేకనో హైపర్ ఆది కలగజేసుకొని, మల్లెమాల టీమ్‌తో మాట్లాడి, మరలా దొరబాబుని జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను బతిమిలాడినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఒక్క దొరబాబు చేసిన తప్పుకి సదరు కామిడి షోలో నటిస్తున్న వారందరికీ మల్లెమాల టీమ్ మెంబర్స్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. 

 

అవేమనగా.. ప్రోగ్రామ్‌లో స్కిట్స్ చేస్తోన్న నటి నటులు వేరే ఈవెంట్స్ కానీ, సినిమాలు కానీ కాపీ చేయడానికి వీళ్లేదు.. వారు ఎక్కడైనా బయట ఈవెంట్ లకు వెళ్లాలన్న వాళ్ల పర్మిషన్ తప్పనిసరి. ఇక ఆడవారిపైన అసభ్యకరమైన పదజాలం.. బూతులు వంటివి నిషిద్ధమట! అలాగే వివిధ హీరోల పేరడీ చేయడానికి వీల్లేదట.. మొత్తంగా అశ్లీలం, అసభ్యత లాంటి టాపిక్స్ తీసుకొనుట పూర్తిగా నిషిద్ధమట! సదరు టీమ్ లో ఎవరన్నా వీటిని అతిక్రమించితే.. మొత్తం టీమ్ నే బహిష్కరిస్తారని మల్లెమాల వారు డప్పు వేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: