కళ్యాణ్ రామ్ కొత్త సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో... దేవుడా బాబాయిని ఫాలో అవుతున్నాడా..

Satvika

ఈ మద్య సినిమా హీరోలు సినిమా సినిమాకు కొత్త లుక్ కొత్త స్టైల్ ఇలాంటి వాటిని ఎక్కువగా చేస్తుంటారు. అప్పుడే అభిమానులు ఆదరిస్తారని వారి నమ్మకం. అందుకోసమే హీరోయిన్ల కన్నా ఎక్కువగా హీరోలు జిమ్ములలో కష్టపడుతున్నారు.   అందుకే సినిమాలు కొన్నే కనీసం కొంతకాలం అయినా కూడా ఆడుతున్నాయి.. అందుకే ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త లుక్ కోసం కష్టపడుతున్నారు.. 

 

 

ఆరంభం కర్లింగ్ హెయిర్ తో వచ్చాడు.. ఆ తర్వాత సాఫ్ట్ గా మార్చాడు.. మొన్న సంక్రాంతికి రిలీజైన ఫ్లాప్ సినిమాలో ఎంతో మోడ్రన్ హెయిర్ తో కనిపించాడు.. ఇంతలోనే మళ్లీ లుక్ మార్చేశాడు... ఇప్పుడు మళ్లీ కర్లింగ్ లుక్ లోకి మారాడు.. ఏమిటీ సిత్రం?  ఇంతకీ ఎవరీ కర్లింగ్ బోయ్ అంటారా?  పరిచయం అవసరం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్. నిర్మాత కం హీరో. దశాబ్ధాల పాటు కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నాడు.

 

 

 

ఆ తర్వాత ఈ మధ్య రామ్ నటించిన ఓ సినిమా వచ్చింది.. ఆ సినిమా ఎంత మంచివాడవురా సినిమాలో నటించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో సినిమాలో నటించడబోతున్నాడు ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా నటించబోతున్నాడు. ఆ సినిమాలో కొత్తగా కనిపించడానికి చాలా కష్టపడుతున్నాడు.. కర్లింగ్ హెయిర్ ని బాగా పెంచాడు. దానికి హెడ్ బ్యాండు పెట్టాడు. ఆ కర్లింగ్  హెయిర్ ఇంకా భీకరంగా పెరగనుందని దీని సంకేతం. ఇక ఆ కోరమీసం.. గుబురు గడ్డం.. ఇదంతా చూస్తుంటే మరో లాల్ సింగ్ చద్దాలాగా కనిపిస్తున్నాడు. ఏమిటో నందమూరి హీరో అమీర్ లా ప్రయోగం చేసేస్తున్నాడు.

 

 

 

ఇంతకీ ఏదైనా బయోపిక్ లో నటిస్తున్నాడా?  లేదూ వారియర్ బయోపిక్ చేస్తున్నాడా? ఒకవేళ అలా నటిస్తే ఎవరి బయోపిక్ లో నటించబోతున్నాడు?  ఏమో తర్వాత సినిమా ఏది? అన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందింకా. ఇక జిమ్ ఫిట్ లుక్ లో కళ్యాణ్ రామ్ లో ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది. అయితే ఎంత చేస్తే ఏం లాభం?  చేయాల్సింది చేయాలిగా..అయితే  ఈ సినిమాలో వేరే హీరో ను చేరుస్తారని సమాచారం.. మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: