నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్!

Edari Rama Krishna

తెలుగు, హిందీ ఇండస్ట్రీలో 80వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది ప్రముఖ నటి జయప్రద.  అందం, అభినయం తో పాటు నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. అప్పట్లో శ్రీదేవి, జయపద్ర అంటే టాప్ హీరోయిన్లు అనేవారు. అయితే వీరిద్దరూ తెలుగు లో టాప్ హీరోయిన్లుగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లోకి వెళ్లారు. అక్కడ కూడా తమ సత్తాచాటుతూ నెంబన్ వన్ రేస్ లోకి వెళ్లారు.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు.  2004 నుంచి 2014 వరకు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున జయప్రద ఎంపీగా కొనసాగారు.  పదేళ్లు ఎంపీగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.

 

కొంత కాలం ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తిరిగి వెండి తెరపై కి ఎంట్రీ ఇస్తుందని భవించారు.. కానీ ఒకటీ రెండు చిత్రాల్లోనే నటించింది.  తాజాగా సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.  2019 లోకసభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లఘించినందుకు ఆమెకు ఈ వారెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.

 

2019 సార్వత్రిక ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాంపూర్ లోకసభ స్థానం నుంచి జయప్రద సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజం ఖాన్ పై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు.  మొదట ఆమె ఎస్పీలో ఉన్నారు. ఓసారి రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు. జయప్రదను ఎస్పీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె బిజెపిలో చేరి రాంపూర్ నుంచి తిరిగి పోటీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: