మోహన్ లాల్ సినిమాకు మెగాస్టార్, మెగాపవర్ స్టార్ సాయం..
మల్లూవుడ్ గా పిలిచే మళయాళ సినీ పరిశ్రమలో మోహన్ లాల్ సూపర్ స్టార్. భారీ ఫ్యాన్ బేస్, రికార్డు కలెక్షన్ల సినిమాలు ఆయన సొంతం. మళయాళ మార్కెట్ కు తగ్గట్టుగా భారీ బడ్జెట్ మూవీస్ లో మోహన్ లాల్ మెయిన్ ఛాయిస్. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కర్ – అరబికడలింతే సింహం’. మోహన్ లాల్ స్నేహితుడు సుప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కుతోంది.
పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించబోతున్నాడు మోహన్ లాల్. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందుకు గానూ ఆయా భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో రేపు (6-3-2020) సాయంత్రం 5గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ద్వారా, రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయనున్నారు. ‘మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ టీజర్ రిలీజ్ కానుంది.
ఏకకాలంలో విడుదలయ్యే ఈ ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య, కన్నడలో యాష్, మళయాళంలో మోహన్ లాల్ విడుదల చేయనున్నాను. దీంతో ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రచారం లభించనుంది. గతంలో విడుదలైన మోషన్ పిక్చర్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేల ధియేటర్లలో మరక్కర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
#MarakkarLionoftheArabianSea
Official telugu #Trailer will be released by Mega Star Shri #Chiranjeevi Garu through konidela Productions Platforms and by mega power star Shri. #Ramcharan in his data-facebook page on 06.03.2020 at 05:00pm. pic.twitter.com/2vibkfek17 — mohanlal (@Mohanlal) March 5, 2020