ఆ పాట రిమేక్ చేసి.. పాడు చేయకండి ప్లీజ్ : మలైకా అరోరా
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సాంగ్స్ మనసుకు హత్తుకునేలా తీశారు.. అలాంటి సాంగ్స్ లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ మూవీ లో ‘ఛల్ ఛయ్య ఛయ్య’ అనే సాంగ్ ఇప్పటికీ.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్. బాలీవడ్ లో టాప్ 10 సాంగ్స్ లో ఒకటి దిల్ సే సినిమాలోని చయ్య చయ్య సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో ఈ సాంగ్ ప్రతి ఇంటా, ఫంక్షన్, హాటల్స్ ఎక్కడ చూసినా మారుమోగేది. మణిరత్నం దర్శకత్వం వహించిన దిల్ సే మూవీలో షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా, మనీషా కొయిరాల కలిసి నటించారు.
మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ, శేఖర్‌కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ సాంగ్ లో మలైకా అరోరా షారుక్ తో కలిసి ట్రైన్ మీద డ్యాన్స్ చేస్తుంది. కదిలే ట్రైన్ మీద డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సాంగ్ ను షూట్ చేశారు. ఈ మూవీలో నీలగిరి పర్వతాల్లోని ఊటిలోని మధ్య నడుస్తున్న రైలు మీద ‘ఛల్ ఛయ్య ఛయ్య’ పాట చిత్రీకరణ జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారని సమాచారం.
తాజాగా దీనిపై హాట్ బ్యూటీ మలైకా అరోరా స్పందించారు. ఆ పాటలో షారూక్ తో ఈ అమ్మడు డ్యాన్స్ అప్పట్లో తెగమెచ్చుకున్నారు. ఈ సాంగ్ ను రీమిక్స్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది. బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ను రీమిక్స్ చేయకుండా ఉంటేనే మంచిది అని అంటోంది మలైకా. ఈ పాట కోసం ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడ్డాం.. ఎప్పటికీ మరుపురాని సాంగ్ దీన్ని దయచేసి రిమేక్ చేసి ఒరిజినాలిటీని దెబ్బతీయకండి అంటూ విజ్ఞప్తి చేసింది.