' హిట్ ' బొమ్మ అదుర్స్.... ప్లస్‌లు (+).. మైనస్ (-) లు ..!
ఈ రెండిటిని ఛాలెంజింగ్ తీసుకున్న హీరో ఏం చేశాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చాలా ప్లస్‌లు ఉన్నాయి. దర్శకుడు డాక్టర్ శైలేష్ తొలి సినిమా అయినా చాలా ఎంగేజింగ్ గా సినిమాను తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే తో మాయ చేయడంతో పాటు ప్రేక్షకులు థియేటర్లలో తెరకు అతుక్కపోయేలా చేయడంతో పాటు సీట్లలో నుంచి ఎంతో ఉత్కంఠతో తెర వైపు నుంచి చూపులు తిప్పకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక సినిమాకు నేపథ్య సంగీతం కూడా ప్లస్ అయ్యింది. ప్రతి సీన్‌ను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది. ఇక విశ్వక్ సేన్ నటన యూత్‌కు, కుర్రకారుకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.
ఇక నాని నిర్మాణ విలువలతో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక మైనస్‌ల విషయానికి వస్తే సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియస్‌గా నడుస్తుంది. అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ చేసుకుంటారా ? అన్నది డౌటే. ఇక కామెడీ తక్కువుగా ఉండడం ఒక మైనస్ అయితే.. సినిమాకు కీలకమైన కమర్షియల్ హంగులకు దూరంగా ఉండడం కూడా చిన్న మైనస్సే అనాలి. అయితే టార్గెటెడ్ ఆడియెన్స్ కోసం వచ్చిన ఈ సినిమా ఆ వర్గాలను పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. హీరోగా విశ్వక్ సేన్‌కు కూడా మంచి పేరు తీసుకు వస్తుంది.