పాటతో ఆకట్టుకుంటున్న సాంగ్.. సినిమా హిట్ పక్కా ..
సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా 'ఓ పిట్టకథ'.. సినిమా టైటిల్ కు తగ్గట్లే సినిమా కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు ప్రేక్షగాకులను పలకరించడానికి మరో ప్రేమకథా చిత్రం రూపొందుతోంది .. ఆ సినిమా పేరే ' ఓ పిట్ట కథ'. విశ్వంత్ - నిత్యా శెట్టి నాయకా నాయికలుగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ మధ్య కొత్త సినిమాల హావ నడుస్తుంది అన్న సంగతి తెలిసిందే..
ఈ సినిమా కు ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ద్వారా చెందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదలయిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లకు జనల నుండి మంచి స్పందన అందు కోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచుతుంది.
ఈ క్రేజ్ ను అలాగే కొనసాగించడానికి చిత్ర యూనిట్ మరోసాన్గ్ ను విడుదల చేసింది."ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో .. నన్ను తాకినట్టు వుంది మాయే ఏదో ఏదో ఏదో. అందమైన మాటకు అర్థమేదో ..ఊహతో రెచ్చగొట్టు భావమేదో" అంటూ ఈ పాట సాగుతోంది. తొలిసారి ప్రేమలోపడిన ఒక యువకుడు, తన ప్రియురాలితో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలను ఊహించుకుంటూ పాడే ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది.
ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా, శ్రీజో సాహిత్యం లో , స్వీకర్ అగస్తి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రేమకథ చిత్రం యూత్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. కొత్త నటులకు తెలుగు చిత్ర పరిశ్రమ సపోర్ట్ చేస్తుందని ఈ సినిమా మరో సారి నిరూపించింది. మరి ఈ సినిమా వీరికి ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.
" height='150' width='250' src="//www.youtube.com/embed/t1OZv_z6nsI" width="560" height="314" allowfullscreen="allowfullscreen">