ఓ అబ్బాయిని...అమ్మాయి రేప్ చేసిందా.. ‘గిల్టీ’ ట్రైలర్..!

Edari Rama Krishna

ఈ మద్య వెబ్ సీరీస్ సందడి ఎక్కువ అయిన విషయం తెలిసిందే.  వెబ్ సీరీస్ కి అయితే ఎలాంటి ఆంక్షలు ఉండవు.. లెన్తీ ప్రోగ్రామ్స్ ఉంటవు.. పెద్దగా ప్రచార ఆర్భాటాలు చేయాల్సిన పనీ ఉండదు.  కామ్ గా కూల్ గా కానిచ్చేస్తున్నారు.  తెలుగు లో కూడా ఈ మద్య వెబ్ సీరీస్ సందడి మొదలి అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా బాలీవుడ్ లో వరుసగా వెబ్ సీరీస్ వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో కియారా ప్రధాన పాత్రలో గిల్టీ అనే వెబ్ సీరిస్ రెడీ చేసింది. తాజాగా ఈ సీరిస్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది.  ఈ వెబ్ సీరీస్ లో కియారా ఓ కాలేజ్ స్టూడెంట్ గా అల్లరి చిల్లరి అమ్మాయిగా కనిపిస్తుంది. 

 

బాయ్ ఫ్రెండ్స్ తో ఎంతో జాలీగా ఎంజాయ్ గా తిరుగుతున్నట్లు గా కనిపిస్తుంది.  అయితే కియారా స్నేహితుల్లో ఓ అర్థరాత్రి పూట రేప్ కి గురి అవుతారట.  అయితే ఇక్కడే ట్విస్ట్... అతడిని రేప్ చేసింది ఒక అమ్మాయి! అని తేలుతుంది. దీంతో అసలు ఎవరు..ఎవరిని అత్యాచారం చేశారు అన్నది ప్రశ్న.  ఈ వెబ్ సీరీస్ యూత్ ఫుల్ గా ఉంది. తమ సాంగ్స్ తో సంగీతంతో ఓ ట్రూప్ గా ఏర్పడిన కొంత మంది ఫ్రెండ్ మద్య జరిగిన సంఘర్షణ ‘గిల్టీ’ వెబ్ సీరీస్ అని తెలుస్తుంది. 

 

తాము చేసిన తప్పులకు ఎంతగా పశ్చాతాప పడతారో టైటిల్ చూస్తేనే అర్థం అవుతుంది.  ఇక గిల్టీ ట్రైలర్ లో కైరా అద్వానిని గతంలో ఎన్నడూ చూడని విధంగా కాస్త గ్లామర్ మాస్ లుక్ తో కనిపిస్తుంది.  సిగరెట్ కాల్చడం.. ఫ్రెండ్స్ తో అమ్మాయిలను టీజ్ చేయడం చూస్తుంటే ఈ అమ్మడి పాత్ర ఎంతో వైల్డ్ గా ఉందో అర్థం అవుతుంది.  మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: