వరల్డ్ ఫేమస్ లవర్ దొబ్బింది... వాళ్లంతా పండగ చేస్కొంటున్నారుగా...!
సడెన్‌గా వచ్చిన క్రేజ్ తో పాటుగా విజయ్ కి యాటిట్యూడ్ కూడా ఎక్కువైంది. తనకి రౌడీ ఫ్యాన్స్ ఉన్నారనే ధీమాతో స్టేజ్ మీద కాస్త ఎక్కువే మాట్లాడేవాడు. తక్కువ టైంలో విజయ్ ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో.. అంతకు మించి యాంటీ ఫ్యాన్స్‌ను కూడా పోగేసుకున్నాడు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో చాలా మంది హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో విజయ్ను ఆటాడుకుంటున్నారు.
డియర్ కామ్రేడ్ అప్పుడే విజయ్ దేవరకొండ చేసిన ఓవరాక్షన్ తో విజయ్ యాంటీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయ్యాడు. అయినా వరల్డ్ ఫెమస్ లవర్ అప్పుడు తగ్గాల్సిన విజయ్ అప్పుడూ రెచ్చిపోయాడు. దీనికి తోడు ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు కూడా విజయ్ కు యాంటీగా ఉంటున్నారని మరో టాక్ ఉంది. ఇప్పుడు విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్.. మిగిలిన హీరోల ఫ్యాన్స్ సినిమాని ట్రోల్స్ చేస్తూ.. సినిమాపై నెగెటివిటీ ప్రచారం చెయ్యడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. వీళ్లంతా సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరి ఇప్పటకి అయినా విజయ్ తీరు మారుతుందో ? లేదో ? చూడాలి.