స్టార్ హీరో కోసం 600 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు...!
మన దేశంలో సినిమాలకు ఉండే ఆదరణ, సినీ నటులకు ఉండే ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశం మొత్తం కూడా కోట్లాది మంది అభిమానులు సినిమా అంటే ప్రాణం పెడుతూ ఉంటారు. తమ అభిమాన హీరోల కోసం ఎం చెయ్యడానికి అయినా సరే అభిమానులు వెనకాడే పరిస్థితి ఉండదు అనేది అందరికి తెలిసిన విషయమే. రక్తదానాలు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, వాళ్ళ కోసం కొన్ని మంచి పనులు చేయడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అభిమానులు. ఈ మధ్య ఇవి మరింత ఎక్కువగా కనపడుతున్నాయి.
తాజాగా ఒక అభిమాని ఎం చేసాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం ఏకంగా 600 కిలోమీటర్ల ప్రయాణం చేసాడు ఒక అభిమాని. తన అభిమాన హీరోని చూసేందుకు గాను ఏకంగా అంత దూరం సైకిల్ వేసుకుని వెళ్ళాడు. అస్సోంలోని తిన్సుకియా ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల భూపెన్ లిక్సన్కు సల్మాన్ అంటే ఒకరకంగా పిచ్చి. ఈ నెల 15న గువహటిలో ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా వస్తున్నాడు.
దీనితో సల్మాన్ ని నేరుగా కలవడానికి గాను... భూపెన్ తన సొంత ఊరు అంటే తిన్సుకియా నుంచి ఫిబ్రవరి 8న సైకిల్‌పై ప్రయాణం మొదలుపెట్టి, ఫిబ్రవరి 13 నాటికి 600 కి.మీ దూరంలో ఉన్న గువహటి వచ్చాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఇతనికి సైకిల్ ప్రయాణంపై మంచి రికార్డ్ కూడా ఉంది. భూపెన్ 48 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో ప్రయాణించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కూడా దక్కించుకున్నారు. సల్లూ భాయ్ పై ఇతనికి ఉన్న అభిమానం చూసి పలువురు షాక్ అవుతున్నారు.