హ్యాపీ సండే 9 ఫిబ్రవరి: ఈ వారం టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ సినిమా ఇదే..!

praveen

టాలీవుడ్ లో గత వారం రోజుల నుండి ఎన్నో  సినిమాలు విడుదలైన రెండింట్లో ఉన్నది మాత్రం ఒక్కటే సినిమా. అదే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ఆర్  సినిమా. ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ లో గత వారం రోజుల నుండి ఇదే హాట్ టాపిక్ గా ఉంది. కేవలం వారం రోజుల నుండేనా అంటే మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక లీక్ రావడం అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిపోవడం జరుగుతూనే ఉంది. ఈవారం విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ వారంలోనే వచ్చింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల చేసేందుకు నిర్ణయించారు రాజమౌళి. 

 


 మొదట ఈ సినిమాను 2020 సంవత్సరం లో జూన్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. అయితే రాజమౌళి సినిమా అంటే... మామూలుగానే రిలీజ్ డేట్ లేట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా లేట్ అవుతుందా లేక సరైన సమయానికి విడుదల అవుతుందా అని అభిమానుల్లో  కూడా అయోమయం నెలకొంది  ఇక తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ని చిత్ర బృందం ఈ వారంలోనే వెల్లడించింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల చేయ  ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చినట్లయింది. 

 

 అంతే కాకుండా వచ్చే సంవత్సరం జనవరి నెలలో  తమ సినిమాలను విడుదల చేద్దామని సిద్ధమవుతున్న దర్శక నిర్మాతలకు కూడా తమ సినిమాలు ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ భారీ అంచనాల  సినిమా ముందు విడుదల చేయాలా వద్దా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ వారం హాట్ టాపిక్ అండ్ ట్రెండింగ్ ట్రాఫిక్ ఈ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ అప్ డేట్ అనే చెప్పాలి. కాక ఇక జనవరి 8వ తేది ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: