ప్రముఖ నటుడు కన్నుమూత!

Edari Rama Krishna

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్  లెజండరీ హీరో కిర్క్‌ డగ్లస్‌ కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 103 సంవత్సరాలు. తన అసమాన ప్రతిభతో కొన్ని దశాబ్దాల పాటు హాలీవుడ్ ను శాసించారు కిర్క్‌ డగ్లస్‌.  ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, ఆయన తమను విడిచిపెట్టి వెళ్లినట్లు ప్రకటించవలసి రావడం విచారకరమని కిర్క్ డగ్లస్ కుమారుడు, నటుడు మైఖేల్ డగ్లస్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.  మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నా" అంటూ తన తండ్రికి మైఖేల్‌ డగ్లస్ నివాళులు అర్పించారు. కిర్క్ తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలని పలువురు హాలీవుడ్ పెద్దలు సంతాపాలు తెలిపారు.

 

ఎన్నో ఒడిదుడకులను ఎదుర్కొన్న ఆయన జీవితం డైనా డిల్‌తో పెళ్లితో  కీలక మలుపు తిరిగింది. పెళ్ళి తర్వాత థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు. ఏడు దశాబ్దాలుగా సాగిన కెరీర్‌లో డగ్లస్ 90 కి పైగా చిత్రాల్లో నటించారు.  1916లో అమ్‌ స్టర్‌డామ్‌ లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన కిర్క్‌ డగ్లస్‌, బాల్యంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. డైనా డిల్‌ తో వివాహం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. పెళ్లి తరువాత నటనను మొదలు పెట్టిన కిర్క్, తొలుత థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. ఆపై వెనుతిరిగి చూడలేదు. 

 

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా, రచయితగానూ నిరూపించుకున్నారు. హాలీవుడ్ స్వర్ణయుగపు స్టార్ హీరోగా ఆయన పేరుతెచ్చుకున్నారు.  ‘స్పార్టకస్’, ‘ది వైకింగ్స్’ వంటి చిత్రాలు 1950, 60 సంవత్సరాలలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను  సాధించాయి. యాస్‌ ఇన్‌ ద హోల్‌’, ‘డిటెక్టివ్‌ స్టోరీ’, ‘లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌’, ‘సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే’, ‘పాత్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘గన్‌ఫైట్‌ ఎట్‌ ద ఓ.కె. కోర్రల్‌’, ‘ద హీరోస్‌ ఆఫ్‌ టెల్‌మార్క్‌’, ‘సటర్న్‌ 3’, ‘స్నో రివర్‌’, ‘టఫ్‌ గైర్సు’, ‘ద విలన్‌’, ‘ద ఫ్యూరీ’, ‘గ్రీడీ’, ‘ఆస్కార్‌’, ‘డ్రా’, ‘ఏ సెంచరీ ఆఫ్‌ సినిమా’, ‘డైమండ్స్‌’ వంటివి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచాయి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
It is with tremendous sadness that my brothers and I announce that Kirk Douglas left us today at the age of 103. To the world he was a

A post shared by Michael Douglas (@michaelkirkdouglas) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: